నాని ఎక్కడికైనా వెళ్లగలడు..తన హిట్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Feb 24, 2022 8:00 am IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి అతి తక్కువ మంది ఫైనెస్ట్ యాక్టర్స్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకడు. తన సినిమాల్లో అత్యంత సహజమైన నటనను కనబరుస్తూ ఆకట్టుకునే పుట్టినరోజు ఈరోజు కావడంతో అభిమానులు సహా సినీ ప్రముఖులు అనేక మంది ఈ నానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి నాని బర్త్ డే గిఫ్ట్ గా తాను చేసిన లేటెస్ట్ సినిమా “అంటే సుందరానికి” నుంచి ఒక ఫన్నీ గ్లింప్స్ వచ్చి ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో నాని చేసిన సుందరం పాత్ర మంచి ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. తన గత హిట్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్” కి దీనికి చాలా మార్పు ఉంది. దీనితో ఆ సినిమా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్ చెయ్యడం వైరల్ గా మారింది. అంటే సుందరానికి బర్త్ డే గిఫ్ట్ లో నాని మేకోవర్ పై మాట్లాడుతూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలడు అని గౌరవంతో కూడిన ట్వీట్ చేసాడు. దీనితో నాని అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :