“దసరా” కొత్త పోస్టర్..నాని మాస్ నటనా విశ్వరూపం.!

Published on Oct 1, 2022 10:52 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు నటిస్తున్న తన లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “దసరా” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుండగా దీనిలో నాని అయితే నెవర్ బిఫోర్ రోల్ ని ప్లే చేస్తున్నాడు. పూర్తిగా తన మేకోవర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి ఈ రోల్ ని చేస్తుండగా తన సహజ నటనకి సరైన రోల్ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ ఓడెల చూపించనున్నారని ఇది వరకే అర్ధం అవుతుంది.

కానీ ఇపుడు సినిమా నుంచి వచ్చిన లాస్ట్ పోస్టర్ తో అయితే నాని లోని విశ్వరూపం అని చెప్పాలి ఒక మాస్ ఫైట్ లో అయితే తనపై చూపించిన షేడ్ ఊహించని లెవెల్లో ఉంది. దీనితో అయితే ఈ సినిమాలో డెఫినెట్ గా ఒక కొత్త నాని ని చూడడం ఖాయం అని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని అయితే ఈ అక్టోబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టు కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :