పక్కా మాస్ గా “సరిపోదా శనివారం” మొదటి పాట

పక్కా మాస్ గా “సరిపోదా శనివారం” మొదటి పాట

Published on Jun 15, 2024 12:01 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గత రెండు సినిమాలు కూడా సాలిడ్ హిట్స్ కావడంతో తన నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి దర్శకుడు వివేక్ ఆత్రేయతో మరోసారి కలిసి సంయుక్తంగా చేస్తున్న ఆ సినిమానే “సరిపోదా శనివారం”.

ఈసారి పక్కా మాస్ కంటెంట్ తో అలరించేందుకు వస్తున్నా ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ గరం గరం ను మేకర్స్ రిలీజ్ చేసేసారు. మరి ఈ సాంగ్ అయితే పక్కా మాస్ షేడ్ లో ఉందని చెప్పాలి. విశాల్ దద్లాని వోకల్స్ తో జేక్స్ బిజోయ్ మాస్ ట్యూనింగ్ తో అదిరిపోయింది.

అలాగే మెయిన్ గా సాహపాఠి భరద్వాజ్ పుత్రుడు ఇచ్చిన సాహిత్యంలో రెండో చరణం హీరో పాత్రని ప్రతిబింబించేలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా అయితే ఈ సాంగ్ ఒక బ్యాంగర్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య కూడా నటిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఈ ఆగస్ట్ 29న రిలీజ్ కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు