లేటెస్ట్..ఆస్కార్స్ బరిలో నాని “శ్యామ్ సింగ రాయ్”..డీటెయిల్స్ ఇవే.!

లేటెస్ట్..ఆస్కార్స్ బరిలో నాని “శ్యామ్ సింగ రాయ్”..డీటెయిల్స్ ఇవే.!

Published on Aug 17, 2022 3:22 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తన లాస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో “శ్యామ్ సింగ రాయ్” కోసం అందరికీ తెలిసిందే. నాని మరియు నాచురల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది సాలిడ్ హిట్ గా నిలిచింది. అపారంగా తెలుగు సహా ఓటిటి వీక్షకులని థ్రిల్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ కి మూడు క్యాటగిరీలకు గాను పంపబడినట్టు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ చిత్రం పీరియాడిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే భారతదేశ సంప్రదాయ క్లాసికల్ సినిమాల జాబితాలో పంపినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ అంశం సినీ వర్గాల్లో మంచి ఆసక్తిగా మారింది. మరి ఈ ఈ చిత్రానికి అయితే మా 123తెలుగు యూనిట్ ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి కూడా మరో హీరోయిన్ గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు