“అంటే సుందరానికి” పై నాని వేరే లెవెల్ కాన్ఫిడెన్స్.!

Published on Jun 9, 2022 8:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా మరి బ్యూటిఫుల్ అండ్ నాచురల్ హీరోయిన్ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ క్లీన్ ఎంటర్టైనర్ చిత్రం “అంటే సుందరానికి”. యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం రేపు జూన్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈరోజు ఆ హైప్ ని పెంచేందుకు గ్రాండ్ ప్రీ రిలీజ్ జరుగుతుండగా మేకర్స్ ఆల్రెడీ సాలిడ్ ప్రమోషన్స్ లో ఉన్నారు.

అయితే ఈ సినిమాపై నాని ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడో రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మాటల బట్టి తెలుస్తుంది. ఈ సినిమా హిందీలో రిలీజ్ పై మాట్లాడుతూ మేము ఈ సినిమాని హిందీలో డబ్బింగ్ చెయ్యము అని కానీ హిందీలో ఈ సినిమా రీమేక్ హక్కులు కొనుకుంటారు అని సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ సినిమాలో ఆ రేంజ్ లో విషయం ఉందో నాని కాన్ఫిడెన్స్ బట్టి అర్ధం అవుతుంది. మరి రేపు వచ్చే సినిమా అంతే ప్రామిసింగ్ గా ఉంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :