ప్లెసెంట్ పోస్టర్ తో “టక్ జగదీష్” రిలీజ్ డేట్ వచ్చేసింది.!

Tuck Jagadish

నాచురల్ స్టార్ నాని హీరోగా టేకప్ చేసిన ఆసక్తికర ప్రాజెక్టులలో తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న “టక్ జగదీష్” కూడా ఒకటి. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం కోసం నాని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక దీనితో పాటుగా ఆ మధ్య విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఫైనల్ గా నాని తమ చిత్రం విడుదల ఎప్పుడో అన్నది ఒక ప్లెసెంట్ పోస్టర్ తో చెప్పేసారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా మన టాలీవుడ్ లోని సీనియర్ అండ్ టాలెంటెడ్ క్యాస్టింగ్ తో వారి మధ్యలో పెళ్లి కొడుకులా నాని చేతికి గోరింటాకు కాళ్ళకి పారాణితో కనిపించి మంచి పోస్టర్ తో వచ్చే ఏప్రిల్ 16న బాక్సాఫీస్ టక్ చెయ్యడానికి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.

మొత్తానికి క్లాస్, మాస్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాలు ప్రేక్షకులు ఆశించే అంశాలతో నాని మళ్ళీ స్ట్రైక్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ వారు నిర్మాణం వహించారు.

https://twitter.com/NameisNani/status/1347778621339955204?s=20

Exit mobile version