న్యాచురల్ స్టార్ నాని తో మెగాస్టార్ చిరంజీవి

న్యాచురల్ స్టార్ నాని తో మెగాస్టార్ చిరంజీవి

Published on Jan 20, 2022 8:32 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా కి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. చిత్ర పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులు సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా ఈ చిత్రం ఎవరికి నచ్చిందో తెలుసా అంటూ హీరో నాని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. చేసిన కొద్ది సేపటికే మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న ఫొటో ను షేర్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి మరియు హీరో నాని ఫొటోలో మీసాలు తిప్పుతూ స్టైలిష్ గా ఉన్నారు. శ్యామ్ సింగ రాయ్ స్టైల్ లో ఉండటం విశేషం. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కి నచ్చింది అని చెప్పడం, ఫోటో షేర్ చేయడం తో అవి కాస్త వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు