క్యూట్ పిక్ : కొడుకు అర్జున్ తో నాచురల్ స్టార్ నాని

క్యూట్ పిక్ : కొడుకు అర్జున్ తో నాచురల్ స్టార్ నాని

Published on Aug 15, 2022 8:30 PM IST

నాచురల్ స్టార్ నాని ఇటీవల శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి మూవీస్ ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకి వచ్చి వాటితో మంచి సక్సెస్ లు అందుకున్నారు. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తో కలిసి ఆయన చేస్తున్న మూవీ దసరా. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక తరచు తన వ్యక్తిగత, సినీ విషయాలను ఆడియన్స్, ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే అలవాటు గల నాని, నేడు 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొడుకు అర్జున్ తో కలిసి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో షర్ట్ పై జాతీయ జండా ధరించి ఉన్న పిక్ ని కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం తండ్రి కొడుకుల ఈ క్యూట్ ఫై సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు