ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దసరా చిత్రం, నిన్న శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం కి అన్ని చోట్ల నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నాని పెర్ఫార్మెన్స్ పై సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల హీరో నాని సంతోషం వ్యక్తం చేస్తూ, సాలిడ్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జెర్సీ లోని కీలక సన్నివేశం కి సంబంధించిన ఫేమస్ టెంప్లేట్ ను షేర్ చేశారు. రెండు చేతుల్లో కూడా గొడ్డళ్లు కనిపిస్తున్నాయి. దసరా చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల ప్రేమ, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, దీక్షిత్ శెట్టి, సముద్ర ఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
♥️????????#Dasara pic.twitter.com/7vWkxFoKf3
— Nani (@NameisNani) March 31, 2023