నెపోటిజం పై నాని సాలిడ్ ఆన్సర్.!

Published on Feb 25, 2023 7:01 pm IST

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “దసరా”. నాని కెరీర్ లో భారీ బడ్జెట్ తో మరియు భారీ పాన్ ఇండియా సినిమాగా ఇది వస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మొదలు పెట్టగా నిన్ననే నాని బర్త్ డే కూడా జరిగింది. మరి లేటెస్ట్ గా నాని స్మిత టాక్ షో లో పాల్గొనగా ఈ షో అయితే నాని టాలీవుడ్ లో నెపోటిజం పై సాలిడ్ ఆన్సర్ ఇవ్వడం ఇప్పుడు సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ లో నెపోటిజం ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది అంటే అది ప్రేక్షకులే అని నాని మొదటి సినిమాకి లక్ష మంది చూసారు రామ్ చరణ్ మొదటి సినిమా కోటి మంది చూసారు. మరి ఇక్కడ హీరోలని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు అని నాని తెలిపాడు. తాము హీరోలుగా ఎప్పుడు ఎంటర్టైన్ చేయడం వరకే కానీ ఆడియెన్స్ తమకి నచ్చిన వారినే ఎంకరేజ్ చేస్తారని అదిరిపోయే క్లారిటీ ఇచ్చాడు. దీనితో తన స్టేట్మెంట్ ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :