‘రిపబ్లిక్’ సినిమా చూసాక నాని సాలిడ్ రెస్పాన్స్.!

Published on Sep 30, 2021 11:39 am IST


సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా విలక్షణ చిత్రాల దర్శకుడు దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “రిపబ్లిక్”. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం రేపు రిలీజ్ కి వస్తుండగా నాచురల్ స్టార్ నాని ఈ సినిమాని తాను చూసినట్టుగా తెలిపారు. అంతే కాకుండా సినిమాపై తన సాలిడ్ రియాక్షన్ ని వ్యక్తపరిచారు.

సాయి తేజ్ తన అందరి ప్రార్ధనలు అలాగే దయతో ‘రిపబ్లిక్’ రూపంలో మంచి కం బ్యాక్ మరింత స్ట్రాంగ్ గా ఇస్తున్నాడని అంతే కాకుండా ఇది దేవా కట్టా కూడా మళ్ళీ తిరిగి వస్తున్నాడని చెప్పడానికి కూడా ఒక అనౌన్సమెంట్ లాంటిది అని చెప్తూ టీం అంతటికీ ముందే కంగ్రాట్స్ చెప్పారు. మరి దీనితో దేవా కట్ట నుంచి మరో సాలిడ్ డ్రామా లోడ్ అయ్యినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :