నా సినిమా చూడకుండా ఉండడానికి ఒక్క రీజన్ చెప్పమంటున్న నాని !

20th, January 2017 - 03:12:31 PM

nani2
నేచ్యురల్ స్టార్ నాని 2016 హ్యాట్రిక్ హిట్స్ అందుకుని అదే జోరుని కొనసాగించడానికి 2017 లో రిలీజ్ చేస్తున్న మొదటి చిత్రం ‘నేను లోకల్’. డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన వాయిదాపడి ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని నాని కాస్త వెరైటీగా చెప్పాడు. ఒక వీడియోలో క్యాలెండర్ చూపిస్తూ 3న సినిమా రిలీజ్. సినిమా చూడడానికి ఒక్క రీజన్ చెప్పు అని మీరడగచ్చు కానీ చూడకుండా ఉండటానికి ఒక్క రీజన్ చెప్పండి. అందుకే 3వ తేదీ థియేటర్ కు వచ్చేయండి అంటూ వీడియో చేసి దాన్ని ఇన్విటేషనన్ లా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం తాలూకు ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేశారు. సినిమాలో బలమైన కథ, కథనాలను ఉన్నాయని, తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు పాటలకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతమైతే యూత్ ను ఒక ఊపు ఊపేస్తూ సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.