“దసరా” విషయం లో నాని మాటల్లో గట్టి కాన్ఫిడెన్స్.!

Published on Feb 14, 2023 7:04 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కానున్న మన టాలీవుడ్ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తిసురేష్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా”కూడా ఒకటి. మరి ఈ సినిమా ఇప్పుడు సాలిడ్ ప్రమోషన్స్ కూడా జరుపుకుంటుండగా నాని ఈ సినిమా విషయంలో ఎప్పుడు నుంచో గట్టి కాన్ఫిడెన్స్ గా అయితే ఉన్నాడు.

ఇక లేటెస్ట్ గా కూడా సాంగ్ లాంచ్ లో మాట్లాడుతూ ఈ సినిమా కి ఇక ఆల్ ది బెస్ట్ లు ఉండవు కేవలం కంగ్రాట్స్ మాత్రమే ఉంటాయని తెలుపుతున్నాడు. దీనితో ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం తాను ఎంత నమ్మకం గా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉందో లేదో తెలియాలి అంటే ఈ మార్చ్ 30 వరకుఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :