“దసరా” పై నాని సూపర్ కాన్ఫిడెన్స్.!

“దసరా” పై నాని సూపర్ కాన్ఫిడెన్స్.!

Published on Feb 1, 2023 10:01 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్న పలు లేటెస్ట్ సాలిడ్ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా” కూడా ఒకటి. దీనిపై నాని కెరీర్ లోనే భారీ హైప్ నెలకొనగా సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా అవుట్ పుట్ పై టోటల్ యూనిట్ సాలిడ్ కాన్ఫిడెంట్ గా ఉండగా లేటెస్ట్ గా అయితే నాని చేసిన కామెంట్స్ మరిన్ని అంచనాలు సినిమాపై పెంచుతున్నాయి. తాను లేటెస్ట్ గా హాజరైన ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుంది అనే తరహాలో వ్యాఖ్యానించాడు.

గత ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన RRR కన్నడ నుంచి కేజీయఫ్, కాంతారా చిత్రాల కోసం ఎలా మాట్లాడుకున్నారో దసరా కూడా ఆ రేంజ్ లో తెలుగు సినిమా నుంచి దసరా ఉండబోతుంది అని నాని సూపర్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. దీనితో దసరా పై మరింత హైప్ యాడ్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు