టాలెంటెడ్ డైరెక్టర్ తో నాని ?
Published on Oct 30, 2017 1:50 pm IST

నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు, దిల్ రాజు నిర్మాతగా నాని చేస్తున్న ‘ఎంసిఎ’ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా ఫిబ్రవరి లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం, ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి కథా చర్చలు జరుగుతున్నాయి.

హీరో మహేష్ బాబు సిస్టర్ ఇందిర నానితో ఒక సినిమా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం, ‘మనం’ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే విక్రమ్ కుమార్ నానికి లైన్ చెప్పడం జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఇందిరా సందీప్ కిషన్ తో సినిమా చేస్తోంది, నాని సినిమా ఫిబ్రవరి నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.

 
Like us on Facebook