“శ్యామ్ సింగరాయ్” ట్రైలర్ పై చూపిస్తున్న ప్రేమకు థాంక్స్ – నాని

Published on Dec 15, 2021 11:30 am IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం ను నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మించడం జరిగింది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న జరిగిన శ్యామ్ సింగరాయ్ రాయల్ ఈవెంట్ లో చిత్రం కి సంబంధించిన ట్రైలర్ నీ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ కి 4.1 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ ట్రైలర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ మేరకు ట్రైలర్ పై మరియు శ్యామ్ సింగరాయ్ టీమ్ పై చూపిస్తున్న ప్రేమ కి థాంక్స్ అంటూ హీరో నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాక డిసెంబర్ 24 ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చారు. ఈ తేదీ కి శ్యామ్ సింగరాయ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, అభినవ్ గోమతం లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :