హను రాఘవపూడి దర్శకత్వంలో నాని ?

Nani Hanu

2016లో హను రాఘవపూడి దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత మళ్లి వీరిద్దరి కలయికలో మరో సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగింది . కాని తరువాత ఈ సినిమాకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోయారు .

అయితే నాని ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో నటించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హను శర్వానంద్, సాయి పల్లవి జంటగా ‘పడి పడి లేచే మనుసు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాతలతోనే నాని నటించే సినిమాని డైరెక్ట్ చేయాలని హను అనుకుంటున్నారట. ఈ విషయంఫై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత నాని హను సినిమాని మొదలు పెట్టనున్నాడని సమాచారం .

Exit mobile version