శ్రీకాంత్ ఓదెల కంటే ముందు వేరొక డైరెక్టర్‌తో నాని మూవీ..?

శ్రీకాంత్ ఓదెల కంటే ముందు వేరొక డైరెక్టర్‌తో నాని మూవీ..?

Published on Feb 18, 2025 2:11 AM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘హిట్-3’ చిత్రాన్ని రెడీ చేస్తున్న నాని, ఆ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో ఓ సినిమా చేయనున్నాడు. అయితే, ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. కానీ, ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే సూచన కనిపించడం లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాదిలో స్టార్ట్ కూడా చేయనున్నాడు. దీంతో ఈ సినిమాను పూర్తి చేయడానికి ఆయన కొంత సమయం తీసుకోనున్నాడు. ఈ గ్యాప్‌లో నాని మరో డైరెక్టర్ సిబి చక్రవర్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ డైరెక్టర్ నాని కోసం ఓ సాలిడ్ కథను రెడీ చేశాడట.

నాని కూడా ఈ కథ విని ఇంప్రెస్ అయ్యాడని.. అందుకే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కూడా రెడీ అయ్యిందనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు