నాని చేతులు మీదుగా కార్తికేయ ఇంట్రెస్టింగ్ సినిమా ట్రైలర్.!

Published on Oct 31, 2021 2:00 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా సాయి శ్రీపల్లి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “రాజా విక్రమార్క”. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే ఈ సినిమా ట్రైలర్ కట్ ని రిలీజ్ చేస్తున్నట్టు నిన్న క్లారిటీ ఇచ్చారు. మరి ఈ నవంబర్ 1 న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని సాయంత్రం 11:15 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఇది వరకే ఈ ఇద్దరు హీరోలు కూడా “గ్యాంగ్ లీడర్” సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పైగా దీనికీ మెగాస్టార్ సినిమా టైటిల్ చిత్రాలే కావడం విశేషం. మరి నాని రిలీజ్ చేసే ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో కార్తికేయ సరసన తన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా 88రామా రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More