మరోసారి నిర్మాతగా మారుతున్న నాని !

29th, August 2017 - 08:47:14 AM


వరుస విజయాలతో చేతి నిండా పిండా ప్రాజెక్టులతో యమ బిజీగా ఉన్న యంగ్ హీరో నాని మరోసారి నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని వినికిడి. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం నాని నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఒక సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ చెప్పిన ఆసకికరమైన కథ నచ్చడంతో నాని ఈ ప్రాజెక్టును నిర్మించాలని అనుకుంటుకున్నారట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం పెద్ద పెద్ద నటుల్ని కలవడం జరిగిందని, వాళ్ళు కూడా చేయడానికి సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై నాని వైపు నుండి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ బయటకురాలేదు. నానికి మొదటి నుండి నిర్మాతగా రాణించాలనే కోరిక బలంగా ఉంది. గతంలో కూడా ‘డి ఫర్ దోపిడి’ అనే చిత్రాన్ని నిర్మించారు.