నాని “అంటే సుందరానికి” ప్రమోషన్స్ షురూ!

Published on Jun 3, 2022 5:00 pm IST


నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంటే సుందరానికి ఈ నెల 10 న విడుదలకు సిద్ధంగా అవుతోంది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను నిన్న చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఇప్పుడు, మేకర్స్ ఈ చిత్రం యొక్క ప్రమోషన్లను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. నాని మరియు హీరోయిన్ నజ్రియా ఫహద్ ఇద్దరూ చెన్నైలో తమిళ వెర్షన్ కోసం చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కుటుంబ కామెడీ మరియు విభిన్న మతాలకు చెందిన జంట యొక్క కథ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :