నాని “అంటే సుందరానికి” టీజర్ కి ముహూర్తం ఫిక్స్

Published on Apr 18, 2022 12:30 pm IST


నాని హీరోగా అంటే సుందరానికి అనే సినిమా కామెడీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకుంది, ఈ విషయాన్ని మేకర్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. ఈ రోజు, మేకర్స్ వేర్వేరు అవతార్‌లలో లీడ్ పెయిర్ నాని మరియు నజ్రియా ల యొక్క రెండు ఫస్ట్ లుక్ పోస్టర్‌లను విడుదల చేశారు. వారు సాంప్రదాయ మరియు పాశ్చాత్య దుస్తులలో కనిపిస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 10న సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :