నాని “అంటే సుందరానికి” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్!

Published on May 31, 2022 1:20 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తదుపరి చిత్రం అంటే సుందరానికి. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌ లో నానికి జోడీగా మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 2, 2022 న లాంచ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా మరొక పోస్టర్ ద్వారా, వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్శిటీలోని సర్ CR రెడ్డి కాన్వొకేషన్ హాల్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

టీమ్ అక్కడికి చేరుకుని సాయంత్రం 5 గంటల తర్వాత ట్రైలర్‌ను లాంచ్ చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నదియా, నరేష్, హర్షవర్ధన్ తదితరులు కూడా నటిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి స్వరకర్త, జూన్ 10, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :