నాని “అంటే సుందరానికి” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on May 30, 2022 12:30 pm IST


నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికి. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ కథానాయిక గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ ఒక వీడియో గ్లింప్స్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ వీడియో లో ట్రైలర్ రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇచ్చారు

ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 2, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, విడుదల సమయాన్ని మేకర్స్ వెల్లడించలేదు. నదియా, నరేష్, హర్ష తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. అంటే సుందరానికి జూన్ 10, 2022న తెలుగు, తమిళం మరియు మలయాళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :