త్వరలో రిలీజ్ కానున్న నాని “అంటే సుందరానికి” OST

Published on Jul 19, 2022 11:33 am IST

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటే సుందరానికి. ఈ చిత్రంలో నజ్రియా ఫహద్ కథానాయిక గా నటించడం జరిగింది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. అంటే సుందరానికి OST (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) అతి త్వరలో విడుదల కానుందని సంగీత లేబుల్ SaReGaMa తెలుగు తాజాగా ప్రకటించడం జరిగింది.

సినిమా విజయంలో వివేక్ సాగర్ సంగీతం కీలక పాత్ర పోషించింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లోని పాటలైనా, వివేక్‌ తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం లో నదియా, నరేష్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థియేటర్లలో కంటే OTTలో మంచి స్పందన వస్తోంది.

సంబంధిత సమాచారం :