నైజాం లో బ్రేక్ ఈవెన్ సాధించిన నాని “దసరా”

Published on Apr 2, 2023 1:30 pm IST

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో ఇటీవల విడుదలైన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనం కొనసాగిస్తోంది. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యారు. విడుదలైన మూడో రోజు నైజాం రీజియన్‌లో ఈ సినిమా స్ట్రాంగ్‌గా కొనసాగి రూ. 4.10 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇది రెండవ రోజు కలెక్షన్ కంటే ఎక్కువ.

దీంతో దసరా చిత్రం నైజాం లో మొత్తం 14.33 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ సాధించడం జరిగింది. ఈ చిత్రం ఆదివారం భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, సముద్రఖని, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :