నాని “దసరా” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

నాని “దసరా” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Oct 25, 2022 3:58 PM IST

తన కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేసిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాని. అతను ఇప్పుడు తన ప్రతిష్టాత్మక చిత్రం దసరా చిత్రం లో మాస్ అవతార్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం అయిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని డిఫెరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. తన కెరీర్‌లో భారీ బడ్జెట్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు