యూఎస్ లో నాని “దసరా” కి ప్రీ సేల్స్ అదుర్స్!

Published on Mar 28, 2023 11:33 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి హైప్ ఉంది. దేశవ్యాప్తంగా నాని చేసిన ప్రమోషన్స్ తో ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం యూఎస్ లో ప్రీ సేల్స్ నుండి 200కే డాలర్ల మార్క్ ను అధిగమించింది.

అమెరికాలో నానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమా ఫస్ట్ వీకెండ్‌లో సాలిడ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే సినిమా లాంగ్ రన్ బాగానే ఉంటుంది. నాని సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా, దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. షైన్‌ టామ్‌ చాకో, సముద్రఖని, జరీనా వహాబ్‌, సాయికుమార్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :