టాప్ లో ట్రెండ్ అవుతోన్న “దసరా” ట్రైలర్

టాప్ లో ట్రెండ్ అవుతోన్న “దసరా” ట్రైలర్

Published on Mar 16, 2023 1:02 PM IST

నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ చిత్రం మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో దసరా ట్రైలర్ మరియు పాటలకు సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం ట్రైలర్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ ను తెలుగు లో మాత్రమే కాకుండా, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. భారీ వ్యూస్ తో ట్రైలర్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇక చంకీల అంగీలేసి పాట సైతం విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ పాట యూ ట్యూబ్ మ్యూజిక్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు