నాగ చైతన్యను డైరెక్ట్ చేయనున్న నాని డైరెక్టర్

Naga-Chaitanya
నేచ్యురల్ స్టార్ నాని ని ‘అష్టాచమ్మా’ తో పరిశ్రమకు హీరోగా పరిచయం చేసి, అతని కెరీర్లో ‘ జెంటిల్మెన్’ వంటి మర్చిపోలేని హిట్ ఇచ్చిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి త్వరలో యంగ్ హీరో నాగ చైతన్యతో కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలం చిత్రం నిర్మించనుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలవుతుందని తెలుస్తోంది.

ఇకపోతే చెతన్య కూడా ఈ ప్రాజెక్ట్ కాక తన రెండు సినిమాలు ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ లు రిలీజ్ కు రెడీగా ఉండగానే మరో రెండు చిత్రాలను ప్రారంభించనున్నాడు. వాటిలో ఒకటి ‘సోగ్గాడే చినన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకి ‘ఒకసారి ఇటు చూడవే’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో కృష్ణ అనే కొత్త దర్శకుడితో మరో సినిమాని మొదలుపెట్టనున్నాడు చైతన్య.