నాని “జెర్సీ” చిత్రానికి మూడేళ్లు…డిలీటెడ్ సీన్ విడుదల…మామూలుగా లేదుగా!

Published on Apr 19, 2022 8:02 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ జెర్సీ. ఈ చిత్రం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకోవడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ, అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఒక డిలీటెడ్ సీన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సీన్ చాలా బాగుంది. నాని, ఈ పాత్ర తో ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఈ సీన్ ఉండటం విశేషం.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం లో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా, అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరించారు.

డిలీటెడ్ సీన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :