నాని ‘ఎం.సి.ఏ’ థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడంటే !
Published on Dec 7, 2017 4:10 pm IST

నాని నటించిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్దమవుతోంది. ఆఖరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమా యొక్క రెండు పాటలు ఇప్పటికే విడుదలై అభిమానులను అలరించగా పూర్తి ఆడియోని డిసెంబర్ 11 న విడుదలచేయనున్నారు. అంతేగాక అదే రోజున అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ను సైతం రిలీజ్ చేస్తున్నారు.

నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ఇందులో నానికి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. అంతేగాక ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ పవన్, మహేష్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించిన భూమిక ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

 
Like us on Facebook