నాని ‘ఎమ్ సి ఏ’ గా వచ్చేది ఎప్పుడంటే !


వరుస విజయాలతో నాని తిరుగు లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో నాని నటించిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. నాని ప్రస్తుతం ఎమ్ సీ ఏ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు.

డిసెంబర్ 21 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. నాని సరసన సాయి పల్లవి నటిస్తుండడం ఆసక్తిని రేపుతోంది. ఫిదా చిత్రంలో తన పెర్ఫామెన్స్ తో అందరిని సాయి పల్లవి మాయ చేసింది. నాని ఎలాగూ నటనలో దుమ్ము రేపుతాడు. దీనితో వీరిద్దరో నటిస్తున్న ‘ఎమ్ సి ఏ’ చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.