నాని ఎంట్రీతో రసవత్తరంగా మారనున్న డిసెంబర్ వార్ !
Published on Jul 26, 2017 11:35 am IST


ఈ సంవత్సరం ‘నేను లోకల్, నిన్ను కోరి’ వంటి చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్న నాని ముచ్చటగా మూడో హిట్ కూడా అందుకుని హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ని డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. నాని వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

పైగా నానికి జోడీగా ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి నటిస్తుండటంతో వారిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కూడా సినిమా హైప్ ను పెంచేస్తోంది. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ శ్రీవెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇకపోతే డిసెంబర్ 22న అఖిల్ – విక్రమ్ కుమార్ ల సినిమా రిలీజవుతుండటంతో పాటు రామ్ చరణ్ – సుకుమార్ ల ‘రంగస్థలం-1985’ కూడా అదే నెలలో విడుదలయ్యే ఛాన్సుంది. దీంతో డిసెంబర్ పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.

 
Like us on Facebook