మిలియన్ మార్కుకు అతి దగ్గరలో ‘నేను లోకల్’ !


వరుసగా ఐదు హిట్లందుకుని ఈ ఏడాది ‘నేను లోకల్’ చిత్రంతో దాన్ని డబుల్ హ్యాట్రిక్ గా మలిచాడు హీరో నాని. ఈ చిత్రం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఓవర్సీస్ లో సైతం మంచి టాక్ తెచ్చుకుని మొదటి వారం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ మధ్య హీరోలంతా ఓవర్సీస్ వసూళ్ల మీద గట్టిగా ఆసక్తి చూపుతున్న నైపథ్యంలో నాని కూడా ఈసారి ఎలాగైనా మిలియన్ మార్క్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రీమియర్లను అక్కడి ప్రేక్షకులతో కలిసి చూసి మంచి ఓపెనింగ్స్ రాబట్టాడు.

అలా మొదటి ఐదు రోజుల్లోనే $828,038 గ్రాస్ ను రాబట్టిన ఈ చిత్రం రెండవ వారంలో మాత్రం బాగా ఇబ్బంది పడింది. $8.2K నుండి $9K కు చేరుకోవడానికి దాదాపు మూడు రోజులు తీసుకుంది. ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం నిన్నటి వరకు $917,000 డాలర్లను రాబట్టిన ఈ చిత్రం ఇంకొన్ని రోజుల్లో మిలియన్ మార్కును చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని త్రినాథ రావ్ నక్కిన డైరెక్ట్ చేయగా కీర్తి సురేష్ నాని సరసన హీరోయిన్ గా నటించింది.