‘నేను లోకల్’ అంటున్న నాని..!

9th, August 2016 - 01:52:29 PM

nani
నాని ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన ఓ స్టార్. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన ‘జెంటిల్‌మన్’ వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న ఈ హీరో, అప్పుడే తన కొత్త సినిమా ‘మజ్ను’ను విడుదలకు సిద్ధం చేయడమే కాక, మరో సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధమైపోయారు. ‘సినిమా చూపిస్త మావా’ ఫేం త్రినాధరావు నక్కిన తెరకెక్కించనున్న ఈ సినిమా రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

నాని స్టైల్లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాకు ‘నేను లోకల్’ అన్న టైటిల్‌ను ఖరారు చేసేశారు. నాని సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు. ఇక నాని నటిస్తోన్న ‘మజ్ను’ సినిమా విషయానికి వస్తే, విరించి వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.