“దసరా” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల… సూస్ కుందాం అంటున్న నాని..!

Published on Oct 15, 2021 3:52 pm IST

న్యాచురల్ స్టార్ నాని నటుడు గా కొత్త ప్రయాణం మొదలు పెట్టారు. ఎన్నడూ చూడని పాత్రలను నాని ప్రస్తుతం చేస్తున్నారు. అందుకు నిదర్శనమే తాజాగా విడుదల అయిన దసరా చిత్రం ఫస్ట్ లుక్. ఈ దసరా పండుగ కి పెద్ద అనౌన్స్ మెంట్ తో మన ముందుకు వచ్చారు నాని. నాని దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో నాని సరసన హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటిస్తుంది.

దసరా పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ తో పాటుగా, నాని లుక్ ను విడుదల చేయడం జరిగింది. నాని లుక్ ఈ చిత్రం లో మాస్ గా ఉంది. సింగరేణి ప్రాంతం లోని సాధారణ తెలంగాణ యాస లో “జమ్మి వెట్టి జెప్తాన్న బద్దల్ బాసింగాలైతై, సూస్ కుందామ్ అంటూ నాని చెప్పుకొచ్చారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ ను చూస్తుంటే, దర్శకుడు కి నాని ఎందుకు అవకాశం ఇచ్చారు అనేది తెలుస్తోంది. బతుకమ్మ పాట మాస్ టచ్ ఇవ్వడానికి రీమిక్స్ చేయబడింది. కంటెంట్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని చెప్పాలి. గోదావరి ఖని లో సింగరేణి కొల్ మైన్స్ లో ఉన్న ఒక గ్రామంలో జరిగే కథ లా ఉన్నట్లు తెలుస్తోంది. నాని ను ఈ చిత్రం లో మరింత యాక్షన్ చూపించే అవకాశం ఉంది.

సముద్ర ఖని, సాయి కుమార్, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ isc ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :