నాని కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

17th, October 2017 - 11:19:42 AM

డబుల్ హ్యాట్రిక్ అందుకుని ఊపు మీదున్న హీరో నాని తాజాగా చేస్తున్న చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా సినిమాకు కొత్త తరహా కథల్ని, తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేస్తున్న నాని ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో ఎలా ఉంటాడో, సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను రేపు దీపావళి సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవితో జోడీ కడుతున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇది కాకుండా నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ అనే సినిమా కూడా చేస్తున్నారు.