‘మహలక్ష్మితో పెళ్లికి…’ హీరో నాని..??

Nani
వరుసగా పరాజయాలు పలకరించడంతో యువ హీరో నాని కొత్తదనానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలన్ని కొత్త తరహా కాన్సెప్ట్ లతో రూపొందుతున్నాయట. ‘ఎవడే సుబ్రమణ్యం’ త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా తర్వాత ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తారు. ఈ సినిమాలో ముగ్గురు చిన్నారుల కోసం ఇటివలే కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చారు.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నాని – హను రాఘవాపుడి సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాకు ‘మహలక్ష్మితో పెళ్లికి దూరం 150 కిమీ’ అనే టైటిల్ పెడితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తున్నారట. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫిల్మ్ నగర్ వాసుల్లో ఈ టైటిల్ ఆసక్తిని రేపింది.

Exit mobile version