పారిస్ బ్యాక్ డ్రాప్లో నాని కొత్త సినిమా !

19th, July 2017 - 04:18:03 PM


ఈ మధ్యే ‘నిన్ను కోరి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని వరుసగా 7వ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నాని తన తర్వాతి రెండు సినిమాలను సిద్ధం చేసేపనిలో ఉన్నాడు. వాటిలో శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా మెర్లకపాక గాంధీ డైరెక్ట్ చేయనున్న ‘కృష్ణార్జున యుద్ధం’ త్వరలో ప్రారంభంకానుంది. ఈ సినిమాలో నాని కృష్ణ, అర్జున్ అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

ఈ రెండు పాత్రలో ఒకటి పారిస్ బ్యాక్ కలిగిన పాత్ర కావడం వలన నాని త్వరలో షూటింగ్ కోసం పారిస్ వెళ్తారని వినికిడి. ఇక రెండవ పాత్ర తిరుపతి నైపథ్యం కలిగి ఉంటుందని అంటున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఉన్న తిరుపతి, పారిస్ ల ముఖ చిత్రాలు చూస్తే సినిమా ఈ రెండు ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుందని అర్థమైపోతుంది. మరి బ్యాక్ డ్రాప్ లొకేషన్లలోనే ఇంత వైరుధ్యాన్ని చూపిస్తున్న దర్శకుడు గాంధీ సినిమాలో ఎలాంటి కొత్తదనాన్ని చూపిస్తారో చూడాలి.