సూపర్ కూల్ గా “సరిపోదా శనివారం” నుంచి నాని సెకండ్ లుక్

సూపర్ కూల్ గా “సరిపోదా శనివారం” నుంచి నాని సెకండ్ లుక్

Published on Jul 4, 2024 4:13 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లాస్ట్ రెండు సినిమాలు కూడా సాలిడ్ హిట్ అవ్వడంతో మంచి ఫామ్ లో ఇప్పుడు తాను ఉన్నాడు. ఇలా ఇదే ఫామ్ తో తాను స్టార్ట్ చేసిన మరో సినిమానే “సరిపోదా శనివారం”. దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేస్తున్న రెండో సినిమా ఇది కాగా దీనిపై సాలిడ్ బజ్ నెలకొంది.

ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మంచి బజ్ ని ఆడియెన్స్ లో జెనరేట్ చేయగా మేకర్స్ ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా రివీల్ చేశారు. దీనితో ఈ సినిమాలో నాని రెండో లుక్ వదులుతున్నట్టుగా తెలపగా ఇప్పుడు ఈ లుక్ వచ్చేసింది. మరి ఈ లుక్ అయితే మంచి సూపర్ కూల్ గా ఉందని చెప్పాలి.

పాత బైక్ నడుపుతూ హ్యాపీగా నవ్వుతు ఉన్న నాని ఇందులో కనిపిస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు కనిపించే వైలెన్స్ కి ఇన్స్యూరెన్స్ ఈ సూర్య అంటూ తనలోని సాఫ్ట్ యాంగిల్ ని అయితే ఇందులో చూపించారు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఆగస్ట్ 29న సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు