శరవేగంగా నాని “సరిపోదా శనివారం” షూటింగ్!

శరవేగంగా నాని “సరిపోదా శనివారం” షూటింగ్!

Published on Jun 13, 2024 3:00 AM IST

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి చిత్రం వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. వారి రెండవ చిత్రం సరిపోదా శనివారం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. జూన్ 17 వ తేదీ వరకూ ఈ షూటింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ శనివారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సరిపోదా శనివారం చిత్రం ఆగస్ట్ 29, 2024న భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు