సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “శ్యామ్ సింగరాయ్”

Published on Dec 19, 2021 5:43 pm IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

కృతి శెట్టి, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా ఈ చిత్రం లో నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నాని రెండు గెటప్స్ లో కనిపిస్తుండటంతో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :