ఈ నెల 18 కి “శ్యామ్ సింగరాయ్” టీజర్ విడుదల

Published on Nov 11, 2021 5:32 pm IST


నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాక సినిమా పై అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ విడుదలైంది. రైజ్ ఆఫ్ శ్యామ్‌ కి విశేష స్పందన లభించింది. అయితే తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయడం జరిగింది. నవంబర్ 18 వ తేదీన ఈ చిత్రం టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

చిత్ర యూనిట్ విడుదల చేసిన తాజా పోస్టర్ లో నాని ఉగ్రరూపం దాల్చారు. శ్యామ్ సింగరాయ్ టీజర్ ఎలా ఉండబోతుంది అనేది ఈ పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది. సత్యదేవ్ జంగా కథతో తెరకెక్కిన ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాక జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్ మరియు చాలా ప్రతిభావంతులైన యష్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమతం కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24 వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం అన్ని సౌత్ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More