
‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ సినిమాలతో విజయాలను అందుకొని కెరీర్లో శరవేగంగా సినిమాలు చేసే పనిలో ఉన్న హీరో నాని. ఇప్పటికే భలే భలే మగాడివోయ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గీత ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి మారుతి నిర్మాత. ఇదిలా ఉంటే నానికి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా గుర్తింపు ఉంది. దాని వల్ల నాని తాజాగా ఓ తమిళ సినిమాలో స్పెషల్ అతిధి పాత్ర చేసాడు.
‘పల్లండు వాజగ’ అనే సినిమాలో నాని అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి అంజన అలీ ఖాన్ డైరెక్టర్. అంజన అలీ ఖాన్ గతంలో వెప్పం అనే సినిమా తీసింది. ఆ సినిమాలో నాని, నిత్యా మీనన్, బిందు మాధవి, కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ పరిచయంతో పాటు ఈ సినిమాలో హీరోగా రాహుల్ రవీంద్రన్ కనిపించనున్నాడు. డైరెక్టర్ అంజన, హీరో రాహుల్ రవీంద్రన్ తో ఉన్న సాన్నిహిత్యం వలన నాని ఇందులో అతిధి పాత్ర చేసాడు.