హిట్ దర్శకుడ్ని రిపీట్ చేయనున్న నాని !


టాలీవుడ్ లో హైయెస్ట్ సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని గ్యాప్ లేకుండా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇటీవలే ‘నేను లోకల్’ చిత్రంతో ఆకట్టుకున్న ఆయన ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వానంద్ తో చేస్తున్న నూతన చిత్రం తాలూకు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, టైటిల్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ కానున్నాయి. మరోవైపు నాని ఇంకో ప్రాజెక్టుకి రెడీ అవుతున్నాడు.

తనకు ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ లాంటి ఫీల్ గుడ్ సక్సెస్ ను అందించిన దర్శకుడు హను రాఘవపూడితో ఈ సినిమా ఉండనుంది. శ్రీనివాస్ ప్రసాద్, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనుండగా, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు పనిచేసిన యువరాజ్ సినిమాటోగ్రఫీ చేయనున్నారు. ఇలా నాని తనకు కలిసొచ్చిన దర్శకుడ్ని రిపీట్ చేయడం ఇది రెండోసారి. గతంలో ‘అష్టా చెమ్మా’తో తనను పరిశ్రమకు పరిచయం చేసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటితో కలిసి రెండవ సినిమాగా ‘జెంటిల్మెన్’ చేసి ఘన విజయం అందుకునన్నాడు నాని.