హీరో నాని ఈమధ్య భిన్నమైన సినిమాలనే ఎంచుకుంటున్నారు. ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమాలతో తనలోని వైవిధ్యాన్ని చూపించిన నాని మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఆయన తన కొత్త సినిమాను శివ నిర్వాణ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనేది టైటిల్. ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అందులో నాని ఫార్మల్ డ్రెస్లో టక్ చేసుకుని ఫోజిచ్చాడు.
టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తే సినిమాలో ఏదో కొత్త కాన్సెప్ట్ ఉందనే అనిపిస్తోంది. మరి టక్ చేసుకొచ్చిన నాని ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి. పైగా శివ నిర్వాణ గతంలో నానితో ‘నిన్ని కోరి’ లాంటి హిట్ చిత్రం చేసి ఉండటంతో వీరి కాంబోపై అంచనాలు అధికంగా ఉన్నాయి. ఈ సినిమాను నిర్వాణతో ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్నారు. ఇందులో రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు.
