
‘నాన్నకు ప్రేమతో’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, విలక్షణ దర్శకుడు సుకుమార్ రూపొందిస్తోన్న స్టైలిష్ రివెంజ్ డ్రామా. సెట్స్‌పైకి వెళ్ళిన రోజునుంచే అంతటా విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చిన ఈ సినిమా, తాజాగా విడుదలైన టీజర్‌తో సంచలనంగా మారిపోయింది. దసరా కానుకగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సంబంధించి ఓ 30 సెకండ్ల నిడివి గల టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతోంది.
ఇప్పటివరకూ ‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ టీజర్ 30 లక్షల పై చిలుకు వ్యూస్ సాధించి తెలుగు సినిమా టీజర్స్ విషయంలో ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక గతంలో ఏ ఒక్క తెలుగు సినిమా టీజర్‌కూ ఈ సినిమాకు వచ్చినన్ని హిట్స్ రాకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లైక్స్ విషయంలోనూ నాన్నకు ప్రేమతో రికార్డు కొట్టింది. సుమారు 48,000 పైచిలుకు లైక్స్‌తో ఈ టీజర్ టాప్‌లో నిలిచింది. ఇక తమ అభిమాన హీరో సినిమా టీజర్‌తోనే ఈ స్థాయి సంచలనం సృష్టించడంతో అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు.
ఇక గతంలో ఏ సినిమాలోనూ కనిపించనంత స్టైలిష్‌గా, సరికొత్త లుక్‌తో ఎన్టీఆర్ ఈ టీజర్‌తో కట్టిపడేశారు. సుకుమార్ మార్క్ స్టైలిష్ మేకింగ్ ఈ టీజర్లో స్పష్టంగా కనబడుతోంది. ఎన్టీఆర్ లుక్, చిన్న చిన్న స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌కు అభిమానుల దగ్గర్నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి