‘నాన్నకు ప్రేమతో’ టీజర్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగ నిన్నట్నుంచే మొదలైన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న స్టైలిష్ రివెంజ్ డ్రామా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను నిన్న సాయంత్రం ఎన్టీఆర్ విడుదల చేశారు. ఇప్పటికే పోస్టర్స్, స్టిల్స్‌తో ఆసక్తి పెంచిన ఈ సినిమా ఫస్ట్ టీజర్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. 30 సెకండ్ల నిడివి గల ఈ టీజర్లో ఎన్టీఆర్, గతంలో ఏ సినిమాలోనూ కనిపించనంత స్టైలిష్‌గా, సరికొత్త లుక్‌తో విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. సుకుమార్ మార్క్ స్టైలిష్ మేకింగ్ ఈ టీజర్లో స్పష్టంగా కనబడుతోంది.
ఇక విడుదలైన కొద్దిసేపటికే యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నాన్నకు ప్రేమతో ట్రెండింగ్‌గా నిలిచింది. విడుదలైన 20 గంటల్లోనే ఈ సినిమా 6లక్షల 50 వేలకు పై చిలుకు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ లుక్, చిన్న చిన్న స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌కు అభిమానుల దగ్గర్నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి నెలలో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.
టిజేర్ కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
