“RRR” సినిమాపై నారా లోకేష్ ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్.!

“RRR” సినిమాపై నారా లోకేష్ ఎగ్జైటింగ్ పోస్ట్ వైరల్.!

Published on Mar 25, 2022 12:00 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర వినిపిస్తున్న ఏకైక సినిమా పేరు “RRR”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ ఫైనల్ గా ఈరోజు థియేటర్స్ లోకి రావడంతో దేశ వ్యాప్తంగా కూడా సందడి వాతావరణం నెలకొంది.

మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి విశేష ఆదరణ అందుకోవడంతో ఏపీ కి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీ అయినటువంటి తెలుగు దేశం పార్టీ యువ అధ్యక్షులు నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఈ సినిమాపై చెయ్యడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

“ఈ సినిమాపై మంచి రివ్యూస్ వినడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని ఒక గ్రేట్ చిత్రాన్ని డెలివర్ చేసినందుకు దర్శకుడు రాజమౌళి మరియు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి కంగ్రాట్స్ తెలుపుతున్నానని లోకేష్ తెలిపారు. అంతే కాకుండా ఈ వారంలోనే నా కుటుంబంతో కలిసి ఈ చిత్రం తప్పకుండా చూస్తానని ఈ చిత్రం అన్ని రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నానని” లోకేష్ ఎగ్జైటింగ్ పోస్ట్ చెయ్యగా ఇది వారి అభిమానుల్లో మంచి వైరల్ గా మారిపోయింది. ఈ భారీ సినిమా రివ్యూ కోసం కింద చూడండి.

RRR సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు